Bhairavam: మహాశివరాత్రి సందర్భంగా 'భైరవం థీమ్' సాంగ్ రిలీజ్.! 1 y ago
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్న "భైరవం" మూవీ విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో, ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్లె హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలోని 'భైరవం థీమ్' సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తాండవం చేసినట్లుగా చూపించారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాయగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.